పరగడుపున ఈ సూపర్‌ఫుడ్స్ తినండి.. వ్యాధులు మీ దరిచేరవు..!

ముఖ్యంగా చలికాలంలో సీజనల్‌ వ్యాధుల ప్రమాదం పొంచి ఉంటుంది. బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
బొప్పాయిలో విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది. దీనిని పరగడుపున తింటే శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
నానబెట్టిన డ్రై ఫ్రూట్స్‌ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఏవైనా గింజలను నీటిలో నానబెట్టి ఉదయం పరగడుపున తినాలి.
అంతే కాకుండా రోజూ ఒక యాపిల్ తింటే రోగాలు దూరం అవుతాయి. యాపిల్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల ఆహారం ఎక్కువగా తినకుండా ఉంటారు.