నిద్ర లేవగానే ఫోన్​ చూస్తున్నారా.. పెద్ద తప్పు చేస్తున్నారు జాగ్రత్త..!

ఉదయం నిద్రలేచిన వెంటనే మెసేజ్‌లు, ఈమెయిల్‌లు, నోటిఫికేషన్లు, సోషల్‌ మీడియా అప్‌డేట్లు చూడటం వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురికావాల్సి ఉంటుంది.
మొబైల్ ఫోన్‌ల వినియోగం వల్ల యువతలో నిద్రలేమి, డిప్రెషన్ ప్రభావం నేరుగా పడుతుందని తేలింది.
ఈ ప్రభావం మానసిక స్థితిపైనా, కంటి ఆరోగ్యంపై పడుతుందని అధ్యయనాలు చెప్తున్నాయి.
స్మార్ట్‌ఫోన్ వినియోగాన్ని పూర్తిగా నివారించలేకపోయినప్పటికీ కొన్ని విషయాల్లో ఫోన్ వినియోగాన్ని తగ్గించవచ్చు. అది ఆయా వ్యక్తులను బట్టి ఉంటుంది.