చలికాలంలో మడమల పగుళ్లు ఇబ్బంది పెడతాయి.. ఈ పద్ధతిలో మృదువుగా మార్చుకోండి..!
పాదాల రంగు కూడా మారుతుంది. మరికొందరు బయటికి కూడా రాలేకపోతారు. మీరు పగుళ్ల సమస్యను ఎదుర్కొంటుంటే కొన్ని చిట్కాలను పాటించాలి.
చలికాలంలో పాదాలను క్లీన్‌గా ఉంచుకోవాలి. స్నానం చేసేటప్పుడు లేదా ఖాళీ సమయం దొరికినప్పుడు పాదాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
పగిలిన మడమల మీద తేనెను అప్లై చేయవచ్చు. ఇది పాదాలను మృదువుగా, అందంగా మారుస్తుంది.
మడమల పగుళ్లకు బియ్యం పిండి చాలా మేలు చేస్తుంది. దీనితో బాగా స్క్రబ్ చేయాలి. ప్రతిరోజు చేస్తుంటే వారం రోజుల్లో పగుళ్ల మాయమవుతాయి.