పరగడుపున ఈ ఆకులు నమిలితే చాలా మంచిది.. ఈ వ్యాధులు దరిచేరవు..!
చాలా మంది దీనిని మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తారు. మరికొందరు ఇంట్లో కుండీలలో పెంచుతారు.
కరివేపాకులో భాస్వరం, కాల్షియం, ఐరన్‌, రాగి, విటమిన్లు, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవన్నీ శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి.
కరివేపాకు తినడం వల్ల రేచీకటి లేదా అనేక ఇతర కంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఎందుకంటే ఇందులో విటమిన్ ఎ అనే ముఖ్యమైన పోషకం ఉంటుంది.
కరివేపాకులను ప్రతిరోజూ ఉదయం పరగడుపున నమలాలి. ఎందుకంటే ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, ఆమ్లత్వం, ఉబ్బరం వంటి కడుపు సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.
కరివేపాకును నమలడం వల్ల సులువుగా బరువు తగ్గుతారు. పొట్ట కొవ్వు తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. ఇందులో ఇథైల్ అసిటేట్, మహానింబైన్, డైక్లోరోమీథేన్ వంటి పోషకాలు ఉంటాయి.