సోమవారం శివుడికి ఇలా అభిషేకం చేయండి.. ఈ సమస్యలు తొలగిపోతాయి..!

ఆ పరమశివుడు అభిషేక ప్రియుడు. అందుకే ఈరోజు కొన్ని పదార్థాలతో శివాభిషేకం చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయి.
జీవితంలో ఉన్న సమస్యలు అన్ని తొలగిపోతాయి. పూజ పద్దతి గురించి తెలుసుకుందాం.
పచ్చి పాలతో శివునికి అభిషేకం చేయడం వల్ల ఇంట్లో గొడవలు, మనస్పర్థలు దూరమవుతాయి. కుటుంబంలో శాంతి నెలకొంటుంది.
సోమవారం పెరుగుతో శివునికి అభిషేకం చేయడం వల్ల జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి.
సోమవారం శివుడికి వెన్నతో అభిషేకం చేయడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి.