ఘోర ప్రమాదం.. భర్త మృతి.. భార్య కోమాలోకి!

nanireddy
Updated on: 24 Dec 2018 1:33 PM IST
ఘోర ప్రమాదం.. భర్త మృతి.. భార్య కోమాలోకి!
X

హైదరాబాద్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 కు దగ్గరలోని ఇందిరానగర్ కు చెందిన దంపతుల్లో భర్త మృతి చెందగా భార్య కోమాలోకి వెళ్ళింది.. వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన గింజుపల్లి రాజేంద్రప్రసాద్‌(33) ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఇందిరానగర్ లో నివాసం ఉంటున్నారు. ఆదివారం సెలవు కావడంతో భార్య భువనతో కలిసి గుడికి వెళ్ళాడు రాజేంద్రప్రసాద్‌.. తిరిగి వస్తుండగా ఇందిరానగర్ గ్రీన్ బావర్చి వద్ద ఓ యువకుడు బైక్ పై వేగంగా వస్తున్నాడు. ఇంతలో ఆ యువకుడి బైక్ అదుపుతప్పి రాజేంద్రప్రసాద్‌ బైక్ ను ఢీకొట్టింది. దీంతో దంపతులు కిందపడ్డారు ఈ క్రమంలో రాజేంద్రప్రసాద్‌ తలకు బలమైన దెబ్బ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.. తీవ్ర గాయాలతో అతని భార్య భువన కోమాలోకి వెళ్ళింది. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

nanireddy

nanireddy

Next Story