బంగారం..ఇక్కడ మార్పులేదు..అక్కడ తగ్గింది! వెండి షాకిచ్చింది!!

బంగారం..ఇక్కడ మార్పులేదు..అక్కడ తగ్గింది! వెండి షాకిచ్చింది!!
x
Highlights

హైదరాబాద్ లో బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. బంగారంధరలు ఈరోజు (మే29) దేశీయంగా మిశ్రమంగా కదిలాయి. హైదరాబాద్ లో మార్పులు లేకుండా ఉంటె ..ఢిల్లీ లో మాత్రం...

హైదరాబాద్ లో బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. బంగారంధరలు ఈరోజు (మే29) దేశీయంగా మిశ్రమంగా కదిలాయి. హైదరాబాద్ లో మార్పులు లేకుండా ఉంటె ..ఢిల్లీ లో మాత్రం కాస్త కిందికి దిగివచ్చాయి. మరో వైపు వెండి ధరలు మాత్రం పైకేగాసాయి.

బంగారం ధరలు ఈరోజు మార్పులు లేకుండా నిలిచాయి. శుక్రవారం (29.05.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు బుధవారం నాటి ధర 44,310 రూపాయల వద్ద స్థిరంగా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు ఏ మార్పులు లేకుండా 48,090 రూపాయలు వద్ద నిలిచింది.

పైకెగసిన వెండి ధరలు...

బంగారం ధరలు నిలకడగా ఉండగా, వెండి ధరలు పెరుగుదల బాట పట్టాయి. కేజీ వెండి ధర గురువారం నాటి ధరల కంటే 600 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 48వేల గరిష్ట మార్కుకు చేరింది. కేజీ వెండి ధర 48,500 రూపాయల వద్ద నిలిచింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు గురువారం నాటి ధర వద్దే 44,310 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు నిలకడగా 48,090 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా పెరుగుదల నమోదు చేశాయి. దీంతో కేజీ వెండి ధర ఇక్కడ 48,500 రూపాయల వద్దకు చేరింది.

దేశరాజధాని ఢిల్లీలో...

ఢిల్లీలో బంగారం ధరలు తగ్గుదల నమోదు చేశాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర పది గ్రాములకు 410 రూపాయలు తగ్గి 47,410 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 400 రూపాయలు తగ్గుదల నమోదు చేసి 45,600 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా కేజీకి 600 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో కేజీ వెండి ధర 48 వేల మార్కు వద్దకు చేరి 48,500 రూపాయలుగా నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 29-05-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


హెచ్ఎంటీవీ లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories