అందుకే అలా..విజయ్ ఆంటోనీ!

Update: 2019-06-04 12:30 GMT

బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన విజయ్ ఆంటోనీ తరువాతి సినిమాలు పెద్దగా ఆడలేదు. కానీ, విజయ్ సినిమాల్లో ఎదో ఒక స్పెషాలిటీ ఉంటుందని ప్రేక్షకులు అనుకునేలా చేయగలిగాడు. ఇప్పుడు కిల్లర్ గా  ఈనెల 7 న మన ముందుకు రాబోతున్నాడు. ఈ సందర్బంగా విలేకరులతో విజయ్ మాట్లాడారు. 

తన సినిమాలకు స్పందన రాకపోవడంతోనే బయటి నిర్మాతల సినిమాల్లో చేస్తున్నానని విజయ్ చెప్పారు. కొన్నాళ్ళు సంగీతాన్ని కూడా పక్కన పెట్టి నటన పైనే దృష్టి సారిస్తానని తెలిపారు. నూతన దర్శకుడు ఆండ్ర్యూ లూయిస్ కిల్లర్  సినిమాకి దర్శకత్వం వహించాడు. యాక్షన్ కింగ్ అర్జున్ తో కలిసి నటించడం నాకు చాలా ఆనందంగా వుంది అని తన తాజా చిత్రం కిల్లర్ గురించి వివరించాడు. 

Tags:    

Similar News