డ్రగ్స్‌కేసులో సినీ ప్రముఖులకు సిట్ క్లీన్చిట్
-సినీ ప్రముఖులంతా బాధితులే అన్న సిట్ -చార్జ్‌షీట్‌లో వివరాలను పేర్కొన్న సిట్ అధికారులు
డ్రగ్స్కేసును విచారించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సినీ ప్రముఖులకు క్లీన్చిట్ ఇచ్చింది. సినీ ప్రముఖులంతా బాధితులేనని సిట్ తేల్చి చెప్పింది. దీంతో 3 సంవత్సరాలుగా ఎటూ తేలని టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఓ కొలిక్కి వచ్చినట్లయింది. ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ...RTI ద్వారా డ్రగ్స్‌కేసు వివరాలు కోరినా అప్పట్లో ఎటువంటి సమాధానం రాలేదు.
ఎక్సైజ్ అధికారులు డ్రగ్స్ కేసు వివరాలను బయటకు పొక్కనివ్వలేదు. ప్రస్తుతం వీటన్నిటికీ సమాధానం దొరికింది. సిట్ క్లారిటీ ఇచ్చింది. కేసు ఓ కొలిక్కి వచ్చింది. సినీ ప్రముఖులకు క్లీన్చిట్ లభించింది.