కొత్త సంవత్సరం వేళ సంచలన నిర్ణయం తీసుకున్న ప్రకాష్‌రాజ్

Update: 2019-01-01 04:16 GMT

కొత్త సంవత్సరం వేళ ప్రముఖ బహుభాషా నటుడు ప్రకాష్‌రాజ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకాష్‌రాజ్ ప్రకటన చేశారు. అయితే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసేది త్వరలో చెబుతానని ఆయన పేర్కొన్నారు. ''అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు... మీ అందరి మద్ధతుతో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను'' అని ప్రకాష్‌రాజ్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. 

Similar News