ఆ విషయంలో నమ్రత చాల స్ట్రిక్ట్: ప్రిన్స్ మహేష్

Update: 2019-06-18 15:02 GMT

సినిమాలకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో అంత ప్రాధాన్యత తన కుటుంబ జీవితానికీ ఇస్తారు ప్రిన్స్ మహేష్ బాబు. పిల్లలతో కలసి వేసవి సెలవులు ఎంజాయ్ చేసి వచ్చారు మహేష్. ఆయన ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తన పిల్లల గురించి మాట్లాడారు. తన సినిమాలు పిల్లలు తప్పకుండా చూస్తారని చెప్పారు. సితారకు శ్రీమంతుడు సినిమా చాలా ఇష్టమనీ, గౌతం కు మాత్రం ఇప్పటికీ అతడు సినిమా అంటే ఎంతో ఇష్టం అనీ చెప్పారు మహేష్.

నా సినిమాల విషయంలో బెస్ట్ క్రిటిక్ నమ్రతనే. సినిమా ఎలా ఉందనేది ఆమె కరెక్ట్ గా చెప్పేస్తుందని తన భార్య గురించి చెప్పారు ఆయన. అంతే కాదు నిజం చెప్పాలంటే పిల్లలిద్దరినీ నేను గారం చేస్తాను .. కానీ నమ్రత మాత్రం వాళ్ల విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది" అని చెప్పుకొచ్చారు మహేష్ బాబు. 

Tags:    

Similar News