ఘనంగా వెంకటేష్‌ కుమార్తె వివాహం

Update: 2019-03-24 13:25 GMT

టాలీవుడ్‌ అగ్రనటుడు విక్టరీ వెంకటేష్‌ పెద్ద కూతురు ఆశ్రీత వివాహం వినాయక్ రెడ్డితో ఘనంగా జరిగింది. జైపూర్‌లో జరిగిన ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. వేడుకకు టాలీవుడ్ హీరో రాంచరణ్ దంపతులు, హీరో రానా అలాగే బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కుటుంబసభ్యులు హాజరయ్యారు. వరుడు వినాయక్ రెడ్డి హైదరాబాద్ రేస్ క్లబ్ అధినేత సురేందర్ రెడ్డి మనవడు.

ఈ రోజు(ఆదివారం) ఉదయం జరిగిన ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను రాంచరణ్ భార్య ఉపాసన సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. వధూవరులతో పాటు వెంకటేష్‌ దంపతులతో కలిసి చరణ్ ఉపాసన దిగిన ఫోటో అలాగే హీరో రానా తో కలిసి దిగిన ఫోటోలను ఉపాసన పోస్ట్ చేశారు. దగ్గుబాటి ఫ్యామిలీ సినీ ప్రముఖుల కోసం త్వరలో హైదరాబాద్‌లో రిసెప‍్షన్‌ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. 

Similar News