ఇస్మార్ట్ గా ఉండాలనుకోవద్దు..అది మీ ఆరోగ్యానికి హానికరం!

Update: 2019-07-16 07:17 GMT

ఇస్మార్ట్ శంకర్ లా ఉండాలనుకోవద్దంటూ ఎనర్జిటిక్ స్టార్ రామ్ వార్నింగ్ ఇస్తున్నాడు. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ సినిమా పూర్తి మాస్ మసాలా ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంది. ఈ సినిమా గురువారం విడుదల కానుంది. సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ విషయాన్ని హీరో రామ్ ట్విట్టర్ లో తెలిపాడు.

ఈ సందర్బంగా రామ్ 'ధూమపానం, మద్యపానంతో పాతో ఇస్మార్‌ శంకర్‌లా నిజజీవితంలో వ్యవహరించటం ఆరోగ్యానికి హానికరం. ఇస్మార్‌ శంకర్‌ ఓ కల్పిత పాత్ర అనే తెలుసుకోగలిగినంత ఇస్మార్ట్‌గా వ్యవహరించండి ' అంటూ ట్వీట్‌ చేశారు.

ఇంతకు ముందు పూరీ సూపర్ హిట్ సినిమాలు పోకిరీ, దేశముదురు, బిజినెస్‌మేన్‌ సినిమాలకూ ఏ సర్టిఫికెట్ రావడం గమనార్హం. సినిమా యూనిట్ కూడా ఈ విషయంలో సినిమా కచ్చితంగా సూపర్ హిట్ కొడుతుందని నమ్ముతున్నారు. రామ్‌ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతమందిస్తున్నారు.


 

Tags:    

Similar News