డిస్కో రాజాకి మూడో రాణీగా ఎవరు?

Update: 2019-06-06 14:19 GMT

మాస్ మహారాజా.. రవితేజ డిస్కోరాజాగా శరవేగంగా ముస్తాబవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా రెండో షెడ్యూల్ హైదరాబాద్ చుట్టుపక్కల చిత్రీకరణ జరుపుకుంది. వికారాబాద్ పరిసరాల్లో ప్రస్తుతం డిస్కోరాజా తిరుగుతున్నాడు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని ప్రచారంలో ఉంది. ఇప్పటికే ఒకరు నభా నటేష్‌. ఇంకో హీరోయిన్‌ 'ఆర్‌ఎక్స్‌ 100' ఫేమ్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ ఎంపిక చేసుకున్నారు. మరి మూడో రాణి ఎవరన్నది ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. ఇప్పటికే మూడో హీరోయిన్ ఎంపిక పూర్తయిందని.. త్వరలోనే ఆ వివరాలు ప్రకటిస్తారని చెబుతున్నారు. ఓ ప్రముఖ కథానాయిక ఈ పాత్ర చేస్తోందని వినిపిస్తోంది. డాన్సుల్లో ఇరగదీసే ఆ నటి దాదాపుగా కన్ఫర్మ్ అయిందని చెప్పుకుంటున్నారు. ఏదిఏమైనా అధికారికంగా మాత్రం ప్రకటించడానికి కొంత సమయం పడుతుందట.

వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో రామ్‌ తాళ్లూరి డిస్కో రాజాని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి మంచి స్పందన వచ్చిందని చిత్ర బృందమే ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. 

Tags:    

Similar News