సినిమా అంటే బోలెడు కష్టాలుంటాయి. ముఖ్యంగా షూటింగ్ కష్టాలు చెప్పక్కర్లేదు. రియల్ లొకేషన్ లో షూటింగ్ చేయాలంటే.. పర్మిషన్లు.. అక్కడ పరిస్థితులు.. అభిమానుల తాకిడి ఇన్ని ఇక్కట్లు ఉంటాయి. అందుకే స్టూడియో లలో సెట్ లు వేసి పని కానిచ్చేస్తుంటారు. సినిమా పెద్దదైనా..
చిన్నదైనా సరే.. సెట్ వేయకుండా షూటింగ్ దాదాపు జరగదు. అయితే ఇపుడు ఓ వార్తా ఫిలింనగర్ లో షికారు చేస్తోంది. ఓ సినిమా అసలు సెట్టింగ్ అన్నదే లేకుండా.. మొత్తం రియల్ లోకేషన్స్ లోనే షూటింగ్ పూర్తి చేసుకుందట. అదే 'బ్రోచేవారెవరురా'. విభిన్న సినిమాల కథానాయకుడు విష్ణు తాజా చిత్రమిది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
విభిన్న చిత్రాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం బ్రోచేవారెవరురా. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో హల్చల్ చేస్తోంది. ఈ సినిమాను పూర్తిగా ఒరిజినల్ లొకేషన్స్‌లోనే రూపొందించారట. కనీసం ఒక్క సెట్ కూడా వేయకుండా షూటింగ్ పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. అదే నిజమైతే ఇది కూడా ఓ రికార్డే అంటున్నారు సినీ విశ్లేషకులు. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన సినిమాలు తప్ప కమర్షియల్ జానర్లో రూపొందించే సినిమాలు ఇలా పూర్తి ఒరిజినల్ లోకేషన్లో తెరకెక్కించిటం అరుదైన విషయమే.