నేడు విశాఖకు సీఎం వైఎస్‌ జగన్‌

Update: 2019-06-04 00:49 GMT

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నేడు విశాఖ వెళ్లనున్నారు. ఏపీ సీఎం హోదాలో మొదటిసారి విశాఖపట్నంలో అడుగుపెట్టనున్న వైఎస్ జగన్‌ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందను కలిసి ఆశీస్సులు తీసుకోనున్నారు. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ ముహూర్తంపై స్వరూపానందతో జగన్ చర్చించనున్నట్లు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ‌్యమంత్రి హోదాలో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మొదటిసారి విశాఖలో అడుపెట్టనున్నారు. శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందను కలిసి ఆశీస్సులు తీసుకోనున్నారు. ఎన్నికలకు ముందు పలుమార్లు స్వామి స్వరూపానందను కలిసి దీవెనలు అందుకున్న జగన్‌ వైసీపీ అఖండ విజయం, ప్రభుత్వ ఏర్పాటు తర్వాత మొదటిసారి శారదా పీఠాధిపతిని కలవబోతున్నారు.

వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా, పాదయాత్ర మొదలు అభ్యర్ధుల ప్రకటన వరకు అన్ని విషయాల్లో స్వరూపానంద సూచనలు, సలహాలు, ముహూర్తాల ప్రకారం నడుచుకున్న వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అఖండ విజయం సాధించడంతో స్వామీజీ‌ని కలిసి కృతజ్ఞతలు తెలిజేయనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ ముహూర్తంపై స్వరూపానందతో జగన్ చర్చించనున్నట్లు చెబుతున్నారు. ముఖ‌్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మొదటిసారి విశాఖకు వస్తుండటంతో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు భారీ స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. స్వరూపానందస్వామి ఆశీస్సులు తీసుకున్న తర్వాత పార్టీ నేతలతో జగన్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News