జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తా: ఎమ్మెల్యే క్రాంతి

జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తానని ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి అన్నారు. తన నియోజకవర్గ ప్రజలతోపాటు జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేస్తానన్నారు.

Update: 2019-01-23 12:33 GMT

జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తానని ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి అన్నారు. తన నియోజకవర్గ ప్రజలతోపాటు జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేస్తానన్నారు. ప్రతి జర్నలిస్టుకు అండగా ఉంటానన్న ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తానని తెలిపారు. దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రం మాత్రమే జర్నలిస్టుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. ఇక ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి‌పై ప్రశంసలు కురిపించిన తెలంగాణ ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ తెలంగాణ ఉ‌ద్యమంలో జర్నలిస్టులకు అండగా నిలవడంలో క్రాంతి కీలక పాత్ర పోషించాడని అన్నారు. ఎన్ని ఇబ్బందులెదురైనా ఒక శక్తిగా క్రాంతి నిలబడ్డాడని గుర్తుచేశారు.

Similar News