సీఎం మీటింగ్‌ నుంచి జనం జంప్.. పారిపోకుండా అడ్డుకుంటున్న పార్టీ నేతలు...

Update: 2019-04-02 11:22 GMT

ఎన్నికలు వచ్చాయంటే చాలు ఈతరం ప్రజలకు ఓ విధమైన పండుగే అని చెప్పాలి. ఎన్నికల సభలకు ప్రజలు తమకు తమే స్వచ్ఛందంగా సభలకు తరలి వచ్చే రోజులు ఎన్నడోపోయాయి. తీరు తీరు తిండి. ఉచితంగా మందు, బిర్యానీ డబ్బు ఇలా జనాలకు తగ్గట్టు ట్రెండ్ సెట్ చేసుకుంటున్నారు పార్టీ నాయకులు. ప్రచార సభలకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి మరీ సభలకు తరలిస్తున్న సీన్లు చూస్తునే ఉంటాం. అయితే ఏమిచ్చినా సరే సభలో మాత్రం తాము నిలబడటం మాత్రం తమ వల్ల కాదంటూ పారిపొతున్న ఘటన ఒకటి తమిళనాడులో చోటుచేసుకుంది.

అయితే జనం సభ నుండి పారిపోతున్న మీటింగ్ ఎవరిదో చిన్న చితక నేత కాదు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ఏర్పాటు చేసిన ఎన్నికల సభకు నానాతంటలు పడి జనాలను పొగుచేసి మరి సభకు తొలుకొచ్చారు. సభ ప్రారంభమైన కాసేపటికే అక్కడి నుంచి జారుకోవడం మొదలు పెట్టారు పబ్లిక్. జనం మాత్రం ఆసక్తి చూపకుండా వెళ్లిపోతుండంతో సభ మొత్తం ఖాళీ అవుతుండంతో ఏఐడీఎంకే కార్యకర్తలు ఏకంగా మానవహారం కట్టి పబ్లిక్ పారిపోకుండా అడ్డుకున్నారు. ఇక దీంతో వింతల్లో వింతగా నిలిచింది ఈ ఘటన. దక్షిణ తమిళనాడులోని శివగంగ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో జరిగింది ఈ మీటింగ్. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో తెగ హల్ చల్ చేస్తోంది.

Similar News