పవన్‌కల్యాణ్ పోటీ స్థానంపై క్లారిటీ వచ్చేసింది...!

Update: 2019-03-12 09:02 GMT

జనసేన పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. కాగా తొలి జాబితాలో 17 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, నలుగురు ఎంపీ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయని కూడా తెలిసిందే కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుండి ఎన్నికల బరిలో దిగుతాడో అని అందరిలోనూ ప్రశ్నర్ధకంగా మారింది. వచ్చే నెలలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీచేసే స్థానం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. విశాఖ జిల్లా గాజువాక అసెంబ్లీ స్థానం నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీచేసే అవకాశాలున్నాయని సమాచారం. ఈ మేరకు నేడు జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మొత్తానికి పవన్ కళ్యాణ్ పోటీ క్లారిటీ వచ్చిందనే చెప్పవచ్చు అయితే విశాఖ నార్త్ అసెంబ్లీ సెగ్మెంట్ నుండి సీఎం చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ కూడా పోటీ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా గాజువాక నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని తెలుస్తుండడంతో విశాఖ జిల్లా వాసుల్లో తీవ్ర ఆకస్తిని రేకేత్తిస్తోంది. 

Similar News