ఆ ప్రచారాన్ని నమ్మకండి: కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్

దేశవ్యాప్తంగా విద్యసంస్థల్లో హిందీని తప్పనిసరి చేస్తున్నారంటూ ప్రచారం జోరుగానే సాగుతున్న విషయం తెలిసిందే. కాగా దీనిపై కేంద్రమానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి ప్రకాశ్ జయదేవకర్ స్పందించారు.

Update: 2019-01-10 08:54 GMT

దేశవ్యాప్తంగా విద్యసంస్థల్లో హిందీని తప్పనిసరి చేస్తున్నారంటూ ప్రచారం జోరుగానే సాగుతున్న విషయం తెలిసిందే. కాగా దీనిపై కేంద్రమానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి ప్రకాశ్ జయదేవకర్ స్పందించారు. పాఠశాలలో హిందీ తప్పనిసరంటూ జురుగుతున్న ప్రచారాన్ని జయదేవకర్ ఖండించారు. అదంతా కేవలం మీడియా ప్రచారమేనని అని తన ట్వీట్టర్ వేదికగా స్పందించారు. కొత్త విద్యా విధానం రూపకల్పనపై వేసిన కమిటీ తమకు నివేదిక అందించిందని జయదేవకర్ అన్నారు. కాగా ఆ నివేదికలో ఏ భాషపై ప్రత్యేకమేన సూచనలు లేవని స్పష్టం చేశారు. నివేదికపై జరుగుతున్న ప్రచారాన్ని ఎవరు కూడా నమ్మొద్దని కోరారు. కొన్ని వర్గాలు కావలనే పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నట్లు అసలు అలాంటి ఏమీ లేనే లేదని జయదేవకర్ స్పష్టం చశారు. 

Similar News