అయోధ్య మధ్యవర్తిత్వంపై శివసేన సంచలన వ్యాఖ్యలు...

Update: 2019-03-09 10:02 GMT

వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీ మసీ కేసు పరిష్కరంకై సుప్రీం మధ్యవర్తిత్వ ప్యానల్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే కాగా దినిపై శివసేన సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలు మధ్యవర్తులతో అయోధ్య వివాదం పరిష్కారం కానే కాదని శివసేన అభిప్రాయపడింది. రామాలయ నిర్మాణ విషయంలో కేంద్రసర్కార్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి వెంటనే ఆలయ నిర్మాణాన్ని చేపట్టాలని శివసేన పార్టీ డిమాండ్ చేసింది. అసలు దేశంలోని రాజకీయ నాయకులు, పాలకులు, సుప్రీంకోర్టే పరిష్కరించలేకపోయాయని అలాటప్పుడు మధ్యవర్తులు ఏం చేస్తారని శివసేన ప్రశ్నించింది. అయోధ్య వివాద ప‌రిష్కారం కోసం సుప్రీం ముగ్గురు స‌భ్యుల‌తో మ‌ధ్య‌వ‌ర్తుల క‌మిటీని నియ‌మించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో నేడు శివసేన పార్టీ ధీటుగా స్పందించింది. ఇక ఈ విషయం లోక్‌సభ ఎన్నికల తరువాతే తేలుతుందని శివసేన అభిప్రాయపడింది. మధ్య‌వ‌ర్తుల‌తోనే స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంద‌ని అనుకుంటే గత 25ఏండ్లుగా ఈ స‌మ‌స్య‌ ఎందుకు అలాగే ఉండిపోయింద‌ని, వందలాది మందికి ఎందుకు చనిపోయాని శివసేన నేడు తన సొంత పత్రిక సామ్నాలో ప్రశ్నించింది.

Similar News