సంక్రాంతి తర్వాత రుణమాఫీ పూర్తి: చంద్రబాబు

ఏపీ రాష్ట్రంలో రూ. 83వేల కోట్లతో నిరుపేదలకు 30 లక్షల గృహలను నిర్మించి ఇస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

Update: 2019-01-05 11:08 GMT

ఏపీ రాష్ట్రంలో రూ. 83వేల కోట్లతో నిరుపేదలకు 30 లక్షల గృహలను నిర్మించి ఇస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గత 2004-2014 మధ్య సంవత్సరంలో ఏపీలో వ్యవసాయ రంగం మొత్తం చిన్నాభిన్నమైందని అన్నారు. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందో రైతులకు రూ.24వేల కోట్ల రుణమాఫీ చేసినట్లు చంద్రబాబు వివరించారు. అలాగే సంక్రాంతి పండుగ తరువాత మిగిలిన రుణమాఫీని కూడా పూర్తి చేస్తామన్నారు. శనివారం శ్రీకా‌కుళం జిల్లా రాజాం మండలంలోని పొగిరిలో జన్మభూమి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్య్రక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ వ్యవసాయంలో 11శాతం అభివృద్ధి సాధించినట్లు స్పష్టం చేశారు. ఇప్పటికే వంశధార, నాగావళి నదులను అనుసంధానం చేస్తునట్లు అవసరమైతే గోదావరి జలాలను కూడా శ్రీకాకుళంకి తీసుకోస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Similar News