జగన్‌తో తనకున్న రిలేషన్ చెప్పిన లగడపాటి

Update: 2019-05-20 06:47 GMT

లగడపాటి రాజగోపాల్ అలియాస్ ఆంధ్రా ఆక్టోపస్‌. లగడపాటి ఒకసారి డిసైడ్ చేశారంటే ఆ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. ఇదంతా తెలంగాణ ఎన్నికల ముందు వరుకే. గత ఏడాది డిసెంబర్ లో వచ్చిన తెలంగాణ ఎన్నికల ఫలితాలు లగడపాటి సర్వేకు పూర్తి విరుద్ధంగా వచ్చాయి. దీంతో ఇప్పుడు లగడపాటి సర్వేలో నిజమెంత అనేదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల ఫలితాలపై లగడపాటి రాజగోపాల్‌ తన సర్వే వివరాలను వెల్లడించారు. ఈ ఎన్నికల్లో ఏపీ ఓటర్లు సైకిల్‌, తెలంగాణ ఓటర్లు కారు ఎక్కారన్నారని చెప్పారు. అయితే, లగడపాటి సర్వే ఒక్కటే, జాతీయ సర్వేలకన్నా భిన్నంగా ఉండటం తెలుగు ప్రజల్లో కొంత ఉత్కంఠను రేపుతోంది.

ఈ ఎన్నికల్లో ముఖ్యంగా త్రిముఖ పోరు జరిగినప్పటికీ ఏపీలో తిరిగి టీడీపీదే గెలుపు అని లగడపాటి స్పష్టం చేశారు. ఇక వైసీపీ గట్టిపోటీ ఇచ్చిందని తెలిపారు. టీడీపీకి 90 నుంచి 110 స్థానాలు వస్తాయని చెప్పారు. వైసీపీకి 65 నుంచి 79 సీట్లు వస్తాయని తెలిపారు. జనసేన, ఇతరులకు కలిపి మూడు నుంచి రెండు సీట్ల వరకు వచ్చే అవకాశం ఉందన్నారు. కేవలం రెండు శాతం ఓట్లు మాత్రమే రెండు పార్టీల మధ్య ఉంటుందని అన్నారు.

కాగా గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఎందుకు జోరో అయ్యానన్న విషయాన్ని తర్వాతి రోజుల్లో చెబుతామని చెప్పిన లగడపాటి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తనకున్న బంధాన్నిచెప్పుకొచ్చారు. తనకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అందరూ తెలుసన్నారు. కానీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనకు బాగా దగ్గరన్న లగడపాటి. రాజకీయ అనుబంధం వేరు వ్యక్తిగత అనుబంధం వేరన్నారు లగడపాటి. వైఎస్ కుటుంబంతో తనకున్న అనుబంధం ఎక్కువని చెప్పారు. అయితే అదంతా వ్యక్తిగతం అని తేల్చేశారు. జగన్‌తో తనకు సరైన సంబంధాలు లేవనే ప్రచారం సరికాదనే మాటను చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి లగడపాటి సర్వేలు హీట్ అవుతాయా? లేక ఫట్ అవుతాయా అన్నది మే 23న తేలిపోనుంది. 

Similar News