జూనియర్ ఎన్టీఆర్ మామకు కీలక పదవి... వైఎస్ జగన్ నిర్ణయం

Update: 2019-03-11 09:31 GMT

ఎపీలో ఎన్నికలు మహాయుద్థన్నే తలపిస్తున్నాయి. ఎన్నికల షెడ్యుల్ విడుదల కావడంతో అందరిలో హడవుడి మొదలైంది. ఎవరికి వారే యమునాతీరే అనేలా వ్యవహరిస్తున్నారు. పార్టీలో జోరుగా చేరికలు కూడా మొదలైయ్యాయి. కాగా కొద్ది రోజుల క్రితం వైసీపీ తీర్థంపుచ్చుకున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త, జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు పార్టీలో చేరిన విషయం తెలసిందే కాగా శ్రనివాసరావుకు మొత్తానికి పార్టీలో కీలక పదవి దక్కింది. శ్రీనివాసరావును వైసీపీ కేంద్ర పాలకమండలి సభ్యుడిగా నియమిస్తూ వైసీపీ అధినేత, వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. అంతకుముందు వైయస్ జగన్‌తో సమావేశమైన నార్నె శ్రీనివాసరావు గత నెల 28న వైసీపీలో చేరారు. కాగా శ్రీనివాసరావుకు గుంటూరు ఎంపీ స్థానం లేదా చిలకలూరిపేట అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కాగా ఈ నేపథ్యంలో శ్రీనివాసరావు జగన్ పార్టీలో చేరడంతో టీడీపీ నేతలకు మింగుడు పడడంలేదు. మొత్తానికి జూ. ఎన్టీఆర్ మామకు జగన్ మోహన్ రెడ్డి వైసీపీ పార్టీలో కీలక పదవి ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. 

Similar News