జగన్ భాష బాగోలేదు: పవన్‌కల్యాణ్

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తీరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పపట్టారు.

Update: 2019-01-10 11:15 GMT

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తీరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పపట్టారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డిలా చంపేయండి, చింపేయండని తానెప్పుడూ మాట్లాడలేదన్నారు. తాను ఏ విమర్శచేసిన కాని ఒక ఆదర్శవంతమైన భాషనే వాడనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. నేడు కడప జిల్లా నేతలతో పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దిశ నిర్దేశం చేసేందేకే మూడో పక్షంగా జనసేన పార్టీని స్థాపించానని పవన్ కళ్యాణ్ అన్నారు. తాను రాజకీయాల్లో ఆధిపత్యం చెలయించడం కోసం కాకుండా వ్యవస్థలో మార్పు తీసుకరావడం కోసం జనసైనికులు నిరంతరం కృషి చేయాలని పవన్ పిలుపునిచ్చారు. యువతను రాజకీయశక్తిగా మార్చే భాద్యత తీసుకుంటానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ప్రజారాజ్యం పార్టీ రాకముందే కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టానని, గత 2003 సంవత్సరంలోనే తాను రాజకీయాల్లోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. 

Similar News