పరీక్ష రాస్తూ గుండెపోటుతో ఇంటర్‌ విద్యార్థి మృతి

Update: 2019-03-02 07:56 GMT

 సికింద్రాబాద్ ప్యారడైజ్ వద్ద ఓ కాలేజీలో ఇంటర్ విద్యార్థి పరీక్షా కేంద్రంలో ఆకస్మికంగా గుండె ఆగింది. గోపిరాజ్ అనే విద్యార్థి పరీక్ష రాస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. వైఎంసీఏ న్యూ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న గోపిరాజ్ నివాసం ఉండేది అమీర్‌పేట్‌‌లోని ఎల్లారెడ్డిగూడలో. అయితే, ఉదయం బాగానే ఉన్నాడని, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని విద్యార్థి తండ్రి చెబుతున్నారు. పరీక్ష రాస్తూ కొడుకు చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు.

Similar News