ప్రమాణ స్వీకార వేళ.. అర్ధరాత్రి భారీ వర్షం

Update: 2019-05-30 01:30 GMT

విజయవాడలో నిన్న అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. రాత్రి 11.45 గంటల ప్రాంతంలో ప్రారంభమైన వర్షం 12.15 గంటల వరకు కొనసాగింది. బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో వాతావరణం ఒక్క సారిగా మారిపోయింది. నిన్న ఉదయం నుండి ఎండలు తీవ్రస్థాయిలో ఉండటంతో అవస్థలు పడిన ప్రజానీకం వర్షం రాకతో ఊరట పొందింది. మరోవైపు ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్న ఇందిరా గాంధీ మునిసిపల్‌ స్టేడియం వర్షపు నీటితో తడిసి మద్దయింది. ఒక్క సారిగా బలమైన ఈదురు గాలులు వీచడంతో ప్రమాణ స్వీకారాన్ని వీక్షించేందుకు సభా వేదిక చుట్టుపక్కల ఏర్పాటు చేసిన ఎల్‌ఇడి స్క్రీన్‌లు కింద పడిపోయాయి. నగరంలో రహదారుల వెంట ఏర్పాటు చేసిన జగన్‌ భారీ ఫ్లెక్సీలు సైతం నేలకొరిగాయి. ముందస్తు చర్యల్లో భాగంగా నగరంలో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాను నిలపివేశారు. 

Similar News