తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ షోలో సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుకు తృటిలో తప్పిన ప్రమాదం. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం తుప్రాన్ రోడ్ షో కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీశ్ రావు పాల్గొన్నారు. ప్రచార వాహనంపై హరీశ్ రావు ప్రసంగిస్తుండగా ఉన్నట్టుండి ఒక్కసారిగా జనరేటర్లో మంటలు చెలరేగాయి. దీంతో హరీశ్ రావు ప్రసంగాన్ని అర్థాంతరంగా నిలిపేసి వాహనం దిగిపోయారు. ఈ ఘటన జరిగినప్పుడు ఆ వాహనంపై ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురు పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. కాగా దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.