ఏపీ ఎన్నికల ఫలితాలపై జీవీఎల్ జోస్యం

Update: 2019-04-12 07:33 GMT

గురువారం ఏపీ సార్వత్రిక ఎన్నికలు ముగిసాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో 76.69శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. కాగా ఇక గెలుపు ఓటమిలపై ఆయా పార్టీ అధినేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ నేపథ్యంలో ఏపీలో గెలుపు, ఓటమిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టీడీపీ ఓటమి ఖాయమని వైసీపీనే అధికారంలోకి వస్తుందని జీవీఎల్ జోస్యం చెప్పారు. విజయవాడలో జీవీఎల్ మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన స్థాయిని మరిచి దుర్మార్గంగా రాజకీయాలు చేశారని ఆరోపించారు. తప్పుడు విమర్శలతో ప్రజల్లో చంద్రబాబు విశ్వసనీయత కోల్పోయారని మండిపడ్డారు. ఎన్నికల్లో డబ్బు, రౌడీయిజంతో ప్రజలను భయపెట్టారని విరుచుకపడ్డారు. ఏపీలో ధన రాజకీయాలతో అధికారంలోకి వచ్చేందుకు తెగఆరాటపడ్డారని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు మరింత సమయం ఉండి ఉంటే బీజేపీకి మంచి ఫలితాలు వచ్చేవని చెప్పారు. ఇక ఏపీలో టీడీపీ కనుమరుగు అవ్వడం ఖాయమన్నారు. 

Similar News