ఇటివలు కాంగ్రెస్ పార్టీ గూటికి చేరిన పటీదార్ ఉద్యమ నేత హార్థిక్ పటేల్‌కు భారీ షాక్ తగిలింది. అయితే ఓ దాడి కేసులో హార్థిక్ పటేల్‌కు రెండేండ్లు జైలు శిక్ష పడిన విషయంలో ఈ ఎన్నికల్లో పోటీకి దూరం కానున్నారు. అయితే ఈ కేసులో శిక్షపై స్టే విధించాలన్న హార్దిక్ పటేల్ వినతిని గుజరాత్ హైకోర్టు తోసిపుచ్చింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండేళ్లు, మూడేండ్లు జైలు శిక్ష పడిన ఎవరైనా సరే ఎన్నికల్లో పోటీకి అనర్హులు. దీనిపై స్టే విధించాలని హార్దిక్ పటేల్ విన్నబుచ్చుకోగా దీనిని వ్యతిరేకిస్తూ రాష్ట్ర సర్కార్ అఫిడవిట్ దాఖలు చేసింది. హార్దిక్ పటేల్ పై మొత్తం24 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. అందులో రెండు దేశ ద్రోహ కేసులు కూడా ఉన్నాయని సర్కార్ కోర్టుకు తెలిపింది. ఇక లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి చాలా తక్కువ సమయం మాత్రమే ఉంది. కాగా ఏప్రిల్ 4న నామినేషన్ల చివరి తేదీ. ఇక దీంతో ఆ కొద్ది సమయంలోనే సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు హార్దిక్ పటేల్.