పెళ్లి భోజనంలో మటన్‌ 'ముక్క' లేదని ఘర్షణ

Update: 2019-02-26 06:39 GMT

సాధారణంగా అయితే పెళ్లి విషయంలో అయితే వధువు తరుపు నుండి కట్నకనుకల విషయంలో పరస్సర గొడవ రావోచ్చు సరైన సమయనికి ఇవ్వలేదని పరస్పర గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి కదా! కానీ ఓ పెళ్లి వేడుకలో మాత్రం మటన్ ముక్క కోసం పెద్దఎత్తున గొడవే జరిగింది. అయితే పెళ్లి విందులో మటన్ భోజనం వడ్డించలేదనే కారణంతో పెళ్లికోడుకు తరఫు బంధువులు పెళ్లి కూతురు బంధువులతో ఏకంగా గొడవకే దిగారు. ఈ వివాదం కాస్తా చిలికి చిలికి గాలివానలా మారింది. దింతో ఒకరిపై ఒకరు దాడిలకు దారితీసింది. అయితే ఈ ఘటన ఎక్కడ అని అనుకుంటున్నారా! భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని ఉప్పుసాకలో శుక్రవారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే ఉప్పుసాక గ్రామానికి చెందిన ఆజ్మీరా కుమారి కొత్తగూడేనికి చెందిన లావుడ్యా ప్రవీణ్‌తో వివాహం జరిగింది. కాగా వివాహం అనంతరం భోజనాల పెట్టే సమయంలో పెళ్లికొడుకు తరఫు బంధువులు మాకు మటన్ ముక్కలతో భోజనం వడ్డించలేదనే కారణంతో వధువు బంధువులతో ఘర్షణకు దిగారు. అయితే వధువు బంధువులు సమాధానం చెబుతూ మాకు మటన్ పెట్టే ఆర్థిక స్థోమత లేదని అందుకే చికెన్‌తో పెట్టామని అన్నారు. ఎలాగైన మమ్మల్ని అర్థం చేసుకోవాలని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇదే క్రమంలో మాటమాట పెరిగి గొడవకు దారితీసింది. ఈ గొడవలో 100 కూర్చీలు విరిగిపోగా 8మందికి తీవ్రగాయాలపాలైయ్యారు. అనంతరం ఇరువర్గాలను పోలీస్ ఠాణాకు వెళ్లి ఫిర్యాదులు చేస్తుకున్నారు.

Similar News