బెంగాల్‌లో హింసపై ఈసీ సీరియస్‌

Update: 2019-05-16 01:25 GMT

పశ్చిమబెంగాల్‌లో హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఒక్క రోజు ముందుగానే ఎన్నికల ప్రచారం ముగించాలని ఆదేశించింది. 9 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో రేపటితో ఎన్నికల ప్రచారం ముగియనుంది. రేపు రాత్రి 10 గంటల నుంచి బెంగాల్‌లోని డుమ్‌డుమ్, బరసత్, జేనగర్, మధురాపూర్, జాదవ్‌పూర్, డైమండ్ హార్బర్, సౌత్, నార్త్ కోల్‌కతా నియోజకవర్గాల్లో ప్రచారాన్ని సస్పెండ్ చేస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. హింసాత్మక ఘటనల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం తొలిసారి ఆర్టికల్ 324ను బెంగాల్‌లో ప్రయోగించింది. షెడ్యూల్ ప్రకారం ఎల్లుండి సాయంత్రం 5గంటలకు ఎన్నికల ప్రచారం ముగియాల్సి ఉండగా ఒక్క రోజు ముందుగానే ఎన్నికల ప్రచారానికి ఈసీ బ్రేకులు వేసింది.

మంగళవారంనాడు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా రోడ్‌షో సందర్భంగా టీఎంసీ, బీజేపీ మద్దతుదారుల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు చేటుచేసుకున్నాయి. బెంగాల్‌ ఘర్షణలపై నిన్న రాత్రే బీజేపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పశ్చిమబెంగాల్ లో ఎన్నికలు జరగనున్న 9లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో ఒక్క రోజు ముందుగానే ప్రచారాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది.మరోవైపు ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకున్న కారణంగా హోం సెక్రటరీ పదవి నుంచి ఐఏఎస్ అధికారి అత్రి భట్టాచార్యను తొలిగిసున్నట్టు ఈసీ ప్రకటించింది. ఐపీఎస్ అధికారి రాజీవ్ కుమార్‌ను హోం మంత్రిత్వ శాఖకు రిపోర్ట్ చేయాలని కూడా ఆదేశించింది.

Full View

Similar News