అదనపు చెల్లింపులపై కాగ్‌ అభ్యంతరం

Update: 2019-05-11 03:37 GMT

పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్‌కు 130 కోట్ల రూపాయలు అదనపు చెల్లింపులపై కాగ్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీని ఎందుకు సంప్రదించలేదని ప్రశ్నించింది. ప్రాజెక్టుకు సంబంధించి 2017-18 వరకు చేసిన ఖర్చును కాగ్‌ పరిశీలించింది. కోల్‌కతా బ్రాంచికి చెందిన డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఆడిట్‌ సైంటిఫిక్‌ డిపార్ట్‌మెంట్స్ అధికారులు ఈ ఆడిట్ చేశారు. దీనిపై పోలవరం ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ని ప్రాజెక్ట్ అథారిటీ సభ్య కార్యదర్శి ఏకే ప్రధాన్ వివరణ కోరారు. ఒప్పందంలో పేర్కొనని కూలీలు, యంత్రాలు ఇతర మెటీరియల్‌కు పెరిగిన ధరల పేరుతో అదనపు చెల్లింపులు జరిపినట్టు గుర్తించారు.

Similar News