రాష్ట్రంలోని రహదారులన్నీ అద్దంలా మారాలి: కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో రహదారుల పరిస్థితిపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ రాబోయే రెండేళ్లలో తెలంగాణలోని అన్ని రహదారులన్నీ అద్దంలా మార్చాలన్నారు సీఎం కేసీఆర్.

Update: 2019-01-19 14:36 GMT

తెలంగాణ రాష్ట్రంలో రహదారుల పరిస్థితిపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ రాబోయే రెండేళ్లలో తెలంగాణలోని అన్ని రహదారులన్నీ అద్దంలా మార్చాలన్నారు సీఎం కేసీఆర్. నీరుపారుదల ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత ప్రభుత్వం రహదారులకే ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీలతో సహా రాష్ట్రంలోని మొత్తం 12,751 గ్రామ పంచాయతీలకు బిటి రహదారి సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్రం నుంచి రికార్డు స్థాయిలో జాతీయ రహదారులు సాధించుకున్నమని సీఎం కేసీఆర్ పెర్కోన్నారు. ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన సమీక్షకు ముఖ్య కార్యదర్శులు సునీల్ శర్మ, రామకృష్ణరావు, ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతి రెడ్డి, ఎస్‌ఈ చంద్రశేఖర్, సీఎంవో అధికారులు స్మితా సబర్వాల్, రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు.

Similar News