అవ్వా తాతలకు వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక

Update: 2019-05-31 02:20 GMT

అవ్వాతాతలకు శుభవార్త అందించారు సీఎం వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి నేను ఉన్నానంటూ భరోసా ఇచ్చారు. సామాజిక పెన్షన్లను జూన్‌ నెల నుంచి 2,250 రూపాయలు దశలవారీగా 3వేల వరకు పెంచుతామని హమీ ఇచ్చారు. సీఎంగా ప్రమాణం తర్వాత వైఎస్సార్ పెన్షన్‌ ఫైల్‌పై తొలి సంతకం చేశారు జగన్. మే 14 మహానేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు రైతులకు మేలు కలిగించే ఉచిత విద్యుత్‌ ఫైల్‌పై మొదటి సంతకం చేశారు వై.ఎస్. మే 30 అఖండ విజయంతో అధికారం చేపట్టిన వై.ఎస్. జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు వైఎస్సార్ పెన్షన్ ఫైల్‌పై తొలి సంతకం చేశారు.

అవ్వాతాతల ఆశీస్సుల కోసం పెన్షన్ పెంచుతున్నట్లు ప్రకటించారు జగన్. జూన్ నెల నుంచి రూ. 2250, తర్వాత ఏడాదికి రూ. 2,500, మరుసటి ఏడాది రూ.2,750, తర్వాత సంవత్సరం రూ. 3వేలు అందిస్తామని పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే సామజిక పెన్షన్ల మొత్తాన్ని పెంచుతానని జగన్ పాదయాత్ర, ఎన్నికల సభల్లో హామీ ఇచ్చారు. ఆమేరకు రూపొందించిందే నవరత్నాలు. నేను విన్నాను నేను ఉన్నాను అని ప్రజల కష్టాలను నేరుగా చూసిన జగన్ వాటి అమలుపై ప్రత్యేక దృష్టి సారించారు. నవరత్నాల్లో ఒకటైన పెన్షన్లకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు.

ఏపీలో ప్రస్తుతం 2లక్షల 43వేల ,077 మంది వృద్ధులు, 6లక్షల 33వేల 423 మంది వికలాంగులకు సామాజిక పెన్షన్లు అందుతున్నాయి. వృద్ధులకు రూ.2000, వికలాంగులకు రూ. 3000 అందిస్తున్నారు. దీనివల్ల నెలవారీగా ఖజానాపై రూ.1,160 కోట్ల భారం పడుతోంది. ప్రస్తుతం పెరగనున్న పెన్షన్లతో ఈ భారం మరింత పెరగనుంది.  

Similar News