పార్టీ నేతలపై బాబు గుస్సా ..

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత ఆలోచనలు సొంత నిర్ణయాలను పక్కన పెట్టి పార్టీ నిర్ణయాల మేరకు పని చేయాలని సూచించారు.

Update: 2019-01-21 15:54 GMT

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత ఆలోచనలు సొంత నిర్ణయాలను పక్కన పెట్టి పార్టీ నిర్ణయాల మేరకు పని చేయాలని సూచించారు. పార్టీ నేతలతో ముఖాముఖి మాట్లాడినా మార్పు రావడం లేదంటూ అసంతృప్తి వెళ్లగక్కారు. పార్టీకి నష్టం జరిగే విధంగా ఎవరు వ్యవహరించినా సహించేది లేదంటూ పార్టీ నేతలను హెచ్చరించారు చంద్రబాబు.

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ నేతలకు అధినేత చంద్రబాబు చివాట్లు పెట్టారు. పార్టీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత ఆలోచనలు సొంత నిర్ణయాలను పక్కన పెట్టి పార్టీ నిర్ణయాల మేరకు పని చేయాలని ఆదేశించారు. నేతలతో ముఖాముఖి మాట్లాడినా మార్పు రావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు పార్టీకి నష్టం జరిగేలా ఎవరు వ్యవహరించినా సహించేది లేదంటూ హెచ్చరించారు.

సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ నేతలకు దిశా నిర్ధేశం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. అమరావతిలో జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించిన చంద్రబాబు.. పార్టీ నేతల పనితీరుపై మండిపడ్డారు. సొంత ఆలోచనలు సొంత నిర్ణయాలను పక్కన పెట్టిపార్టీ నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. ప్రత్యేకంగా గుంటూరు జిల్లా నేతల తీరుపైనే ప్రస్తావించారు. పార్టీ నిర్వహించే కార్యక్రమాల పట్ల సీరియస్ నెస్ లేదంటూ మండిపడ్డారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తూ సమావేశాలు నిర్వహించి పార్టీ అభివృద్ధికి సహకరించాలన్నారు. 

Similar News