ఇది ఆరంభం మాత్రమే-చంద్రబాబు

మనకు మనమే బెంచ్ మార్కు పెట్టుకుని పనిచేయాలని చంద్రబాబు సూచించారు. మనకు మనమే బెంచ్ మార్కు పెట్టుకుని పనిచేయాలని చంద్రబాబు సూచించారు.

Update: 2019-01-07 13:48 GMT

మనకు మనమే బెంచ్ మార్కు పెట్టుకుని పనిచేయాలని చంద్రబాబు సూచించారు. మనకు మనమే బెంచ్ మార్కు పెట్టుకుని పనిచేయాలని చంద్రబాబు సూచించారు.పోలవరం ప్రాజెక్టు పనుల్లో రెండు ప్రపంచ రికార్డులు ఆవిష్కృతమయ్యాయి. 16గంటల్లోనే 21వేల 580 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులను అధిగమించి రికార్డు సృష్టించిన నిర్మాణ సంస్థ అనంతరం 24గంటల్లో 32వేల 315 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్‌‌ను డంపింగ్‌ చేసి చరిత్ర సృష్టించింది. దాంతో గిన్నిస్ ప్రతినిధులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి వరల్డ్‌ రికార్డు ధృవపత్రాన్ని అందజేశారు.

రెండు ప్రపంచ రికార్డులతో పోలవరం పనుల్లో చరిత్ర సృష్టించారని నిర్మాణ సంస్థను ఇరిగేషన్ అధికారులను, కార్మికులను సీఎం అభినందించారు. అందరి సమష్టి కృషి వల్లే గిన్నిస్ రికార్డు సాధించగలిగామని అన్నారు. ఇది ఆరంభం మాత్రమేనన్న చంద్రబాబు భవిష్యత్‌లో మరిన్ని రికార్డులు సృష్టిస్తామన్నారు. మార్చిలో ఈ రికార్డును మళ్లీ అధిగమిస్తామని ప్రకటించారు. భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్‌ను దేశం అనుసరిస్తుందని బాబు అన్నారు. పోలవరం పూర్తయితే ఏపీలో కరవనేది ఉండదన్నారు. త్వరలోనే వంశధార, నాగావళి, పెన్నా నదులను అనుసంధానం చేయనున్నట్లు ప్రకటించారు. దేశంలోనే పోలవరం బెస్ట్‌ ప్రాజెక్టన్న చంద్రబాబు 2019లోనే జాతికి అంకితం చేస్తామన్నారు. 

Similar News