ఇక ఇన్‌క‌మింగ్ కాల్స్‌కూ డ‌బ్బు చెల్లించాల్సిందే!

Update: 2018-11-23 09:49 GMT

టెలికం రంగంలోకి వచ్చీ రావడంతోనే సంచలనాలు నమోదు చేసిన రిలయన్స్ జియో దెబ్బకు చాలా టెలికం కంపెనీలు నేటికీ కోలుకోలేకపోతున్నాయి. జియో చవక ధరలను ఎదుర్కొని వినియోగదారులను నిలుపుకోవడం తలకుమించిన భారంగా మారడంతో కంపెనీలన్నీ టారిఫ్‌లను తగ్గించిన విషయం తెలిసిందే కాగా తాజాగా మొబైల్ ఫోన్ వినియోగదారులకు ఉహించని పెద్ద షాక్ తగిలింది. జీవితంతాం ఉచితంగా ఇన్‌కమింగ్ కాల్స్‌కు ఎయిర్‌టెల్,వొడాఫోన్, ఐడియా కంపెనీలు ఇక స్వస్తి చెప్పనున్నాయి. ఇక నుండి ఇన్ కమింగ్ కాల్స్ రావాలన్నా కనీస రిచార్జ్ ఎంతో అవసరమని చెబుతున్నాయి.  నిమిషం లెక్క కాకుండా నెలకొక్కసారి మాత్రం తప్పకుండ చేయించుకొవాల్సిందేనంట. దింతో ఇక నుండి లైఫ్ టైమ్ ఉచిత ఇన్‌కమింగ్ కాల్స్ ఇవ్వకూడదని ఈ సంస్థలు నిర్ణయించాయి. కనీస రీచార్జ్ ప్లాన్స్‌ను తీసుకొచ్చింది. రూ.35, రూ.65, రూ.95 ప్లాన్స్‌ను కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఈ రీచార్జ్ చేసుకుంటే డేటా, టాక్‌టైమ్‌తోపాటు 28 రోజుల వ్యవధి ఉంటుంది. 
 

Similar News

నేను సైతం!
StoryFour
StoryThree