ఎన్టీఆర్ బయోపిక్‌పై మహేశ్ ఆసక్తికర ట్వీట్

Update: 2018-12-23 04:57 GMT

‘ఎన్టీఆర్’ బయోపిక్‌ ట్రైలర్‌ యూట్యూబ్‌లో ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన 24 గంటల్లోనే 40 లక్షల మంది చూశారు. సామాన్యుల మొదలు సినీ ప్రముఖల వరకు అందరి నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ‘ఎన్టీఆర్’ బయోపిక్‌ ట్రైలర్‌ అదుర్స్ అంటూ సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్వీట్ చేశారు. ‘ఎన్టీఆర్’ బయోపిక్‌ ట్రైలర్‌ చూసిన తనకు  రోమాలు నిక్కబొడుచుకున్నాయంటూ మహేశ్ బాబు ట్వీట్ చేశారు. ఎన్టీఆర్‌ పాత్రలో బాలకృష్ణ నటించిన తీరు అద్భుతమంటూ ప్రశంసలతో ముంచెత్తారు. ఎన్టీఆర్ బయోపిక్‌ విజయం సాధించాలంటూ.. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సినిమా కోసం తాను ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నట్టు మహేశ్ ట్వీట్ లో తెలిపారు. 
 

Similar News