22 న దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు నిరసన కార్యక్రమాలు

కరీంనగర్ టౌన్: పట్టణ కేంద్రంలో ఈరోజు బద్దం ఎల్లారెడ్డి భవన్ లో అన్ని కార్మిక సంఘాల సమావేశం సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు యు. శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... 22 న దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు నిరసన కార్యక్రమాలు పిలుపు ఇచ్చాయి. ఈ పిలుపు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, పని చేసే చోట్ల నిరసన కార్యక్రమాలు కార్మికులు చేయాలని కోరారు. కరోనా సాకు చూపి కార్మిక చట్టాలను రద్దు చేయాలని, పని గంటల విధానం పెంచాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే గుజరాత్, ఉత్తర ప్రదేశ్, మద్య ప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, గోవా, రాజస్తాన్, ఒరిస్సా, మహారాష్ట్ర రాష్ట్రాల్లో 8 నుండి 12 గంటలు కావాలని,3 సంవత్సరాల పాటు ఎలాంటి కార్మిక చట్టాలను వర్తించవని నిర్ణయం తీసుకున్నారు.

ఇది కార్మిక వ్యతిరేక చర్యలు. తెలంగాణ రాష్ట్రoలో కూడా అలాంటి అవకాశం కోసం కార్మిక హక్కుల కోసం పోరాటం చేస్తున్న నాయకులను, కార్మికుల పైన జీవో.64 తీసుకొచ్చి అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. కరోనా సమయం లో వేతనాలు ఇవ్వాలని జీవో లు ఇచ్చిన అమలు చెయ్యలేదని వారన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు యు.శ్రీనివాస్, కార్యదర్శి ఎడ్ల రమేష్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు బుచ్చన్న యాదవ్, టేకుమ్మల్ల సమ్మయ్య, ఐఎఫ్టీయూ నాయకులు జిందం ప్రసాద్, టీఎన్టీయూసీ నాయకులు కల్యడపు ఆగయ్యలు పాల్గొన్నారు.



 


Update: 2020-05-20 11:42 GMT

Linked news