పల్లె వెలుగు బస్సులో 30 మంది వరకే ఎంట్రీ

సుదీర్ఘ విరామం తరువాత ఈ నెల 18 నుంచి బస్సులు నడిపేందుకు పౌర రవాణా శాఖ (పీటీడీ) విశాఖ రీజియన్‌ యాజమాన్యం సిద్ధమవుతున్నది. ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన వెంటనే బస్సులను రోడ్డెక్కించడానికి సన్నద్ధం అవుతోంది.కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రయాణికుల మధ్య భౌతిక దూరం వుండేలా బస్సుల సీటింగ్‌లో మార్పులు, చేర్పులు చేస్తోంది. అదేవిధంగా ప్రయాణికులు చేతులు శుభ్రం చేసుకోవడానికి శానిటైజర్‌, లిక్విడ్‌ హ్యాండ్‌ వాష్‌ అందుబాటులో ఉంచనున్నది. కానీ పల్లె వెలుగు బస్సుల్లో సీట్లను మార్చడం లేదు. అయితే 50 సీట్లకుగాను 30 సీట్లలో మాత్రమే ప్రయాణికులు కూర్చోవాలి. ఈ మేరకు ఆయా బస్సుల్లో మార్కింగ్‌ చేయిస్తున్నారు. బస్సుల్లో నిల్చుని ప్రయాణించడానికి అనుమతించరు. పల్లె వెలుగు బస్సుల్లో కండక్టర్లు ఉండరు. డ్రైవర్ల వద్ద టిమ్స్‌ ఉంటాయి. బస్టాండ్‌లో బస్సు ఎక్కే ముందే అక్కడ వుండే సిబ్బంది టిమ్స్‌తో టిక్కెట్లు జారీచేస్తారు. గతంలో మాదిరిగా అన్ని స్టాపుల్లో ఆపరు. లిమిటెడ్‌ హాల్ట్స్‌ మాత్రమే ఉంటాయి.

Update: 2020-05-15 08:28 GMT

Linked news