లాక్ డౌన్ , కోవిడ్ -19 పేరుతో విద్యా రంగాన్ని కార్పోరేట్ శక్తులకు అందించవద్దు

కరీంనగర్ టౌన్: అన్ని రకాల యూనివర్శీటీలకు ఒకే రకమైన అకడమిక్ క్యాలెండర్ ఉండాలిపెండింగ్ ఫెలోషిప్స్ విడుదల చేయాలని, కరోనా పరిస్థితులలో ప్రభుత్వమే విద్యార్థుల ఫీజులు చెల్లించాలని, ఆన్లైన్ భోధన ముఖాముఖి క్లాస్ రూమ్ బోధనకు ప్రత్యామ్నాయం కాదని ఎస్.ఎఫ్.ఐ అల్ ఇండియా పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో, మంకమ్మతోటలోని (ఎస్ ఎఫ్ ఐ) జిల్లా కార్యాలయంలో ప్లేయకర్డ్స్ తో నిరసన చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి శనిగారపు రజినీకాంత్ మాట్లాడుతూ... దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న వేళ ప్రభుత్వం విద్యా రంగాన్ని బలోపేతం చేసేలా, రక్షించేలా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, పైగా ఆన్ లైన్ క్లాసులు, ఆన్ లైన్ పరీక్షలు పేరుతో తరగతులు నిర్వహిస్తున్నారని, ఆన్ లైన్ క్లాసుల పేర ప్రభుత్వ రంగ విద్యరంగానికి త్రీవమైన అన్యాయం బీజేపీ ప్రభుత్వం చేసిందని నిరసిస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా త్రీవ నిరసనలు, ఆందోళనలు నిర్వహించటం జరిగింది. దేశంలో ఆన్ లైన్ లోనే చదువులు, పరీక్షలు నిర్వహించి చదువు పట్ల తన భాధ్యత నుండి ప్రభుత్వం తప్పుకోవాలనే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గజ్జెల శ్రీకాంత్, జిల్లా కమిటీ సభ్యులు ఎం.భరత్, హేమంత్, చరణ్, సంజయ్, పవన్ లు పాల్గొన్నారు.



 




Update: 2020-05-20 11:24 GMT

Linked news