నకిలీ సోషల్ మీడియా అకౌంట్ ను సృష్టించిన యువతిపై కేసు నమోదు

కరీంనగర్ టౌన్: తన ప్రియుడు మరో మహిళతో సన్నిహితంగా మెదులుతున్నాడనే విషయాన్ని జీర్ణించుకోలేక మరో మహిళతో సన్నిహితంగా మెదులుతున్నాడనే విషయాన్ని గుర్తించి ప్రియుడి ద్వారా సదరు మహిళకు సంబంధించిన ఫోన్ నెంబర్ ను తీసుకుని ఆమె ఫోటో తో సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్ ను సృష్టించి వివిధ ప్రాంతాలకు చెందిన వారిని అసభ్యకరమైన, భయాందోళనలు, బెదిరింపులకు గురి చేసే విధంగా పోస్టులు పెట్టడంతోపాటు పలువురికి పదే పదే ఫోన్లు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్న, మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి పై రామడుగు పోలీసులు బుధవారం నాడు కేసు నమోదు చేశారు వివరాలు ఇలా ఉన్నాయి.మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఒక మహిళ ఒక దుకాణంలో పనిచేస్తున్నది. తన ప్రియుడు ఈ మధ్య ఆమెతో సన్నిహితంగా మెదులుతున్నాడనే విషయాన్ని జీర్ణించుకోలేక, సదరు మహిళ ఫోన్ నెంబర్ ను ప్రియుడి ద్వారా సేకరించడంతో పాటు ఇతరుల సహకారం తో సోషల్ మీడియా అకౌంట్ ను ఏర్పాటు చేసింది. అనుమతి లేకుండా తన ఫోటో ను డౌన్లోడ్ చేసి ఈ నూతనంగా సృష్టించిన సోషల్ మీడియా అకౌంట్ కు బాధిత మహిళ ఫోటో పెట్టింది. ఉద్దేశపూర్వకంగా సృష్టించబడిన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అసభ్యకరమైన, భయాందోళనలు, బెదిరింపులు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఉండే పోస్టులను పెట్టడంతోపాటు పలువురికి ఫోన్లు చేస్తున్నది. పదే పదే ఆ నెంబర్ నుండి ఫోన్ కాల్స్ వస్తున్న విషయాన్ని బాధితురాలు రామడుగు ఎస్సై గొల్లపల్లి అనూష దృష్టికి తీసుకువచ్చారు.సత్వరం స్పందించి,టెక్నాలజీ వినియోగంతో సోషల్ మీడియా అకౌంట్ కొనసాగిస్తున్న యువతిని గుర్తించారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు బుధవారం నాడు నకిలీ సోషల్ మీడియా అకౌంట్ ను సృష్టించిన సదరు యువతి పై కేసు నమోదు చేశారు.


 

Update: 2020-05-20 11:21 GMT

Linked news