అంతర్జాతీయంగా నెలరోజుల కనిష్టానికి బంగారం ధరలు

Update: 2019-09-15 03:31 GMT

గత వారం గరిష్టంగా 39,885 రూపాయలు చేరిన బంగారం ధర ఈవారం దాదాపు 6 శాతం పతనమై 2400 రూపాయలు తగ్గింది. ఈ వారాంతానికి 37,400 రూపాయలకు కొద్దిగా అటూ ఇటూగా నిల్చింది. ఇక వెండి కూడా అదే పరిస్థితి. గత వారం గరిష్టంగా కేజీకి 51,489 రూపాయలు ఉన్న వెండి ధర దాదాపు 11 శాతం పతనమై 5659రూపాయలు క్షీణించింది. కొంచెం అటూ ఇటూగా కేజీ వెండి ధర వారాంతానికి 45,830 రూపాయల వద్ద ఉంది.

గ్లోబల్ మార్కెట్‌లో పరిస్థితీ ఇలానే ఉంది. ఇటీవల గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర 1,550 డాలర్ల స్థాయికి చేరిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి చూస్తే బంగారం ధర దాదాపు 4 శాతం పడిపోయింది. వెండి ధర ఔన్స్‌‌కు 17.51 డాలర్ల వద్ద కదలాడుతోంది. రిస్క్ సెంటిమెంట్ మెరుగుపడటం వల్ల బంగారం, వెండి ధరలపై ఒత్తిడి నెలకొంది.

అంతర్జాతీయంగా చూస్తె బంగారం ధర నెలరోజుల కనిష్ట స్థాయికి చేరింది. బంగారం ధరలు తగ్గుతుండడం తొ డిమాండ్ పెరగోచ్చనే అంచనాలలో మార్కెట్ వర్గాలు ఉన్నాయి.


Tags:    

Similar News