జనవరి 14న బజాజ్ చేతక్ స్కూటర్ విడుదల..ధర ఎంతంటే..

Update: 2020-01-09 04:30 GMT

హమారా బజాజ్ అంటూ రోడ్లపై రివ్వున దూసుకుపోయిన చేతక్ స్కూటర్ గుర్తుందా? అసలు ఎలా మర్చిపోతారు?  మధ్యతరగతి స్కూటర్ గా ప్రజల మదిని దోచుకున్న స్కూటర్ చేతక్! తరువాత బైక్ ల పోటీ లో పడి చేతక్ స్కూటర్ ను నిలిపివేసింది బజాజ్. అయితే, ఇప్పుడు మళ్ళీ స్కూటర్ల హవా నడుస్తుండడం.. ఎలక్ట్రానిక్ వాహనాలకు ఆదరణ లభిస్తుండడంతో మళ్ళీ చేతక్ స్కూటర్ ను మార్కెట్ లోకి తీసుకువస్తున్నారు. ఈసారి కొత్తగా ఆధునిక శైలిలో స్కూటర్ ను తీసుకువస్తున్న బజాజ్ దానికి మళ్ళీ అందరి మనసులూ దోచిన చేతక్ పేరునే ఉంచింది.

ఇప్పుడు చేతక్ కొత్త హంగులతో జనవరి 14న మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అధికారికంగా స్కూటర్ కు సంబంధించిన వివరాలు ఇంకా ప్రకటించకపోయినా.. అందుతున్న సమాచారం ప్రకారం ఈ కొత్త బజాజ్ చేతక్ 4kW ఎలక్ట్రిక్ మోటార్ తో.. దానికి ప్రయాణానికి అవసరమైన లిథియం అయాన్ బ్యాటరీలను అమర్చారు. ఇక ఒక్కసారి చార్జి చేస్తే, స్పోర్ట్స్ మోడల్ 85 కిలోమీటర్లు, ఎకానమీ మోడల్ 95 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఇక అన్నిర్కాలుగానూ అత్యాధునిక హంగులు ఈ స్కూటర్ కు ఉంటాయట. మెటల్ బాడీ, ఎల్ఈడీ లైట్లు, సైడ్ స్టాండ్, ఇండికేటర్ ఫీచర్స్, పిలియన్ ఫూట్‌పెగ్స్ ఉన్నాయి. అలాయ్ వీల్స్‌తో పాటు బ్రేకింగ్ కోసం డిస్క్ బ్రేక్ సిస్టంను అమర్చారు. ఈ స్కూటర్‌కు మూడేళ్లు లేదా 50 వేల కిలో మీటర్ల వారెంటీ ఉండవచ్చని భావిస్తున్నారు. ఇన్ని ఫీచర్లతో వస్తున్న నయా బజాజ్ చేతక్ ధర లక్షా ఇరవై వేల రూపాయల వరకూ ఉండొచ్చని అంచానా వేస్తున్నారు. స్కూటర్ బుకింగ్ లు ఇంకా ప్రారంభించలేదు. స్కూటర్ ను మార్కెట్లోకి విడుదల చేసిన తర్వాతే బుకింగ్స్ ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం పూణే లో లాంచ్ చేసే ఈ స్కూటర్ తరువాత ధిల్లీ, ముంబాయి లతో పాటు అన్ని మెట్రో నగరాల్లోనూ అందుబాటులోకి తీసుకువస్తారని తెలుస్తోంది.



Full View


Tags:    

Similar News