Auto News: త్వరలో BS6 ప్రమాణాలతో బజాజ్ పల్సర్ వాహనాలు

BS4 ప్రమాణాల నుంచి BS6 ప్రమాణాలకు బజాజ్ పల్సర్ వాహనాలను అప్ గ్రేడ్ చేసే ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. 2020 సంవత్సరం మొదట్లోనే ఈ వాహన శ్రేణి అందుబాటులోకి తెచ్చేందుకు బజాజ్ ప్రయత్నిస్తోంది.

Update: 2019-09-04 03:59 GMT

బజాజ్ పల్సర్ వాహన శ్రేణిలో మార్పులు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. BS6 ప్రమాణాలను బజాజ్ పల్సర్ బైక్ కు అనుసంధానించే ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. ఈ బైక్ లను 2020 మొదట్లో విడుదల చేసే అవకాశం ఉంది.

బజాజ్ ఆటో పల్సర్ వాహన శ్రేణిని BS6 ప్రమాణాలకు అప్ గ్రేడ్ చేసే ప్రక్రియ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే ఇంజిన్లలో BS6 ప్రమాణాలను క్రోడీకరించిన బజాజ్ హోమోలోగేషన్, సర్టిఫికేషన్ కోసం ప్రస్తుతం ఎదురుచూస్తోంది. వీటిని త్వరలో పూర్తీ చేసుకుని 2020 ప్రారంభంలో వీటిని విడుదల చేసే ప్రయత్నాలలో ఉంది. పూనే కేంద్రంగా పల్సర్ శ్రేణి బైక్ లు ఉత్పత్తి చేస్తున్న బజాజ్ సంస్థ ఇప్పటి వరకూ ఈ శ్రేణిలో RS200, NS200, NS160, Pulsar 220F, Pulsar 180 Neon, Pulsar 150 (standard, Twin Disc and Neon) and Pulsar 125 వంటి మొత్తం ఏడు రకాల బైక్ లను ప్రస్తుతం అందిస్తోంది.

ఇప్పుడు బజాజ్ పల్సర్ ఇంజన్ లో BS6 ప్రమాణాలకు అనుగుణంగా చేస్తున్న మార్పులతో ఈ బైక్ ల ధరలు పెరిగే చాన్స్ ఉంది. ఆయా మోడల్స్ పై ఇప్పుడున్న ధరలకు అదనంగా సుమారు 8 వేల రూపాయల నుంచి 10 వేల వరకూ బైక్ రెట్లు పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. బజాజ్ సహా ఇతర బైక్ ఉత్పత్తిదారులు BS6 ప్రమాణాలకు తగినట్టుగా రూపొందించిన బైక్ లకు ఉత్పత్తి వ్యయం పెరుగుతున్నందున..ఆ భారం వినియోగదారుల పై పడకుండా ఉండేందుకు జీఎస్టి నుంచి ఉపశమనం కల్పించాలని కోరుతున్నారు. ఈ అభ్యర్ధన ను ప్రభుత్వం మన్నిన్చావచ్చని ఆశిస్తున్నారు. ప్రస్తుతం పల్సర్ శ్రేణి వాహనాల (దిల్లీ ఎక్స్ షో రూమ్) ధరలు 66,618 (తాజాగా విడుదల చేసిన పల్సర్ 125 నియాన్) నుంచి 1.4 లక్షల (RS200) వరకూ ఉన్నాయి.















ఇప్పటికే ఉన్న BS4 ప్రమాణాల వాహనాలను ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తోంది బజాజ్. భారత మోటారు పరిశ్రమ BS4 ప్రమాణాల నుంచి BS6 ప్రమాణాలకు 2020 ఏప్రిల్ 1 కల్లా మారాల్సి ఉన్నందున అందుకు అనుగుణంగా తమ ఏర్పాట్లను వేగవంతం చేశాయి. ఇదిలా ఉండగా బజాజ్ ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారించింది. ఈ దిశలో బజాజ్ కు ఏంతొ పేరు తెచ్చిన చేతక్ స్కూటర్లను ఎలక్ట్రిక్ మోడల్ గా మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

మీ అభిప్రాయం చెప్పండి!


Tags:    

Similar News