సీఎం జగన్ పోరాటపటిమ వల్లే ప్రత్యేక హోదా అంశం బతికి ఉంది ‌: ఎంపీ మార్గాని భరత్‌

Update: 2019-07-07 10:34 GMT

 ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోరాటపటిమ వల్లే ప్రత్యేక హోదా అంశం బతికి ఉందన్నారు రాజమండ్రి పార్లమెంటు సభ్యులు మార్గాని భరత్ రామ్ అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి తీరని అన్యాయమే జరిగిందని భరత్ రామ్ అన్నారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చే దిశగా కూడా బడ్జెట్ లో నిధులు కేటాయింపులు జరగలేదన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రంతో సఖ్యతగా ఉంటూనే రాష్ట్ర హక్కులు సాధిస్తామని అన్నారు. కేంద్రంతో సఖ్యతగా ఉంటూనే రాష్ట్రానికి రావలసిన నిధుల కోసం ఎంపీలంతా కలిసి పోరాడతామని అన్నారు. ఏపీ రాజధాని అమరావతిని విశ్వనగరంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ సంక్పలంతో ఉన్నారని తెలిపారు ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోరాటపటిమ వల్లే ప్రత్యేక హోదా అంశం బతికి ఉందన్నారు. క్లీన్ గంగ తరహాలో క్లీన్ గోదావరి చేపట్టేలా కేంద్రానికి ప్రాజెక్టు రిపోర్ట్ ఇచ్చామని, రాజమండ్రికి స్మార్ట్ సిటీ, హెరిటేజ్ సిటీ హోదాల కోసం ప్రయత్నం చేస్తామని ఎంపీ మార్గాని భరత్‌ పేర్కొన్నారు.

Tags:    

Similar News