వైకుంఠ ఏకాదశికి తరలివస్తున్న భక్తజనం

భక్తకోటితో ఏడుకొండలు నిండిపోయాయి. గోవిందనామ స్మరణలతో సప్తగిరులు మార్మోగుతున్నాయి.

Update: 2020-01-05 04:45 GMT

భక్తకోటితో ఏడుకొండలు నిండిపోయాయి. గోవిందనామ స్మరణలతో సప్తగిరులు మార్మోగుతున్నాయి. రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తరద్వారం గుండా శ్రీవారిని దర్శించుకునేందుకు.. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఇప్పటికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 లోని అన్ని కంపార్ట్‌ మెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లలో వేలాదిగా భక్తులు చేరుకున్నారు. ఇక మాడవీధుల్లోని గ్యాలరీలలో ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్యూల్ లోకి భక్తులను అనుమతిస్తున్నారు.

సుమారు 85 వేల మంది భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. వేచి ఉండేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. కాగా ఇన్నాళ్లు వైకుంఠ ఏకాదశి ద్వాదశి యేడాదిలో రెండు రోజుల్లో మాత్రమే వైకుంఠ ద్వారాలను తెరచి భక్తులను అనుమతిస్తున్నారు టీటీడి. అయితే దర్శనం రోజులను పెంచే విషయమై తుది నిర్ణయం తీసుకుని సమర్పించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశం ప్రకారం.. ఇవాళ టిటిడి అత్యవసర సమావేశానికి సిద్ధమైంది. ఈ సమావేశంలో ఆగమ సలహా మండలి సూచనలు, మఠాధిపతులు, పీఠాధిపతుల సలహాలను పరిగణలోకి తీసుకొనున్నారు. 


Full View


Tags:    

Similar News