నేడే పెట్టుబడుల సదస్సు..

Update: 2019-08-09 03:46 GMT

విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న డిప్లొమాటిక్‌ ఔట్‌రీచ్‌ సదస్సు కాసేపట్లో ప్రారంభం కానుంది. పలు కీలక రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. దీని ద్వారా రాష్ట్రంలో భారీగా పెట్టుబడులను ఆహ్వానించాలని సీఎం జగన్ నిర‌్ణయించారు. ఈ మేరకు సదస్సులో ప్రత్యేక ప్రసంగం చేయనున్నారు. రాష్ట్రంలోని పారిశ్రామిక విధానంపై ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వివరించనున్నారు. మధ్యాహ‍్న భోజన విరామం అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌ పలువురు రాయబారులు, కాన్సులేట్‌ జనరల్‌లతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఈ సదస్సులో యూఎస్‌ఏ, యూకే, జపాన్, కెనడా, కొరియా తదితర 35 దేశాల రాయబారులు, హైకమిషనర్లు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

Tags:    

Similar News