ఉలవపాడు ఎస్‌బీఐలో అగ్నిప్రమాదం

Update: 2019-06-25 01:39 GMT

ప్రకాశం జిల్లాలోని ఉలవపాడు స్టేట్ బ్యాంకు లో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్‌సర్క్యూట్‌తో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలార్పేశారు. ఈ ప్రమాదంలో ఫర్నిచర్‌, కంప్యూటర్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే బ్యాంకులోని గోల్డ్, ఫైల్స్ పరిస్థితేంటన్నది తెలియరాలేదు. ఈ అగ్నిప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

Tags:    

Similar News